స్వరూపానందస్వామి ఆధ్వర్యంలో శిష్య స్వీకార దీక్ష

Mon,June 17, 2019 06:06 PM

sharada peetham Swaroopanand Endra Swami shishya sweekara ceremony

అమరావతి: శారదా పీఠాధిపతి స్వరూపానందస్వామి ఆధ్వర్యంలో శిష్య స్వీకార దీక్ష క్రతువు నిర్వహించారు. శారదాపీఠం ఉత్తరాధికారిగా కిరణ్‌కుమార్ శర్మ సన్యాసం స్వీకరించారు. బాలస్వామి కిరణ్‌కుమార్ శర్మకు స్వరూపానందస్వామి యోగపట్టం అందించారు. శారదాపీఠం ఉత్తరాధికారి దీక్షా స్వీకరణలో సీఎంలు కేసీఆర్, జగన్‌లు పాల్గొన్నారు. కృష్ణానది తీరంలో గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో కార్యక్రమం జరుగుతోంది. మూడురోజుపాటు హోమ, దాన, వైదిక క్రతువులు వైభవంగా జరిగాయి. సన్యాస దీక్ష అనంతరం కిరణ్‌కుమార్ శర్మకు స్వాత్మానందేంద్ర సరస్వతిగా నామకరణం చేశారు. అనంతరం స్వరూపానందస్వామి పాదాలకు స్వాత్మానందేంద్ర సరస్వతి పూజ చేశారు. స్వాత్మానందేంద్ర సరస్వతికి సీఎంలు కేసీఆర్, జగన్‌లు కిరీట ధారణ చేశారు.

1334
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles