చిన్నారి కిడ్నాప్ కేసు ఛేదించిన పోలీసులు

Tue,March 26, 2019 06:32 AM

shamshabad police solved children kidnap case

శంషాబాద్ : రాత్రి మానవత్వంతో చేరదీసిన ఓ మహిళ... ఆ ఇంట్లోనుంచి రెండేండ్ల చిన్నారిని కిడ్నాప్‌నకు పాల్పడి.. చివరికి కటకటాలపాలైంది. ఈ ఘటన శంషాబాద్ ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. పోలీసులు కిడ్నాప్ కేసును 24 గంటల్లో ఛేదించి చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. సమావేశంలో డీసీపీ ప్రకాశ్‌రెడ్డి, ఏసీపీ అశోక్‌కుమార్, సీఐ విజయభాస్కర్‌రెడ్డిలతో కలిసి వివరాలు వెల్లడించారు. శంషాబాద్, సిద్ధేశ్వరకాలనీ పరిధిలో సొంత వెంకటయ్య, యదమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి రేణుక (2) కూతురు సంతానం. కాగా.. ఈ నెల 23న సాయంత్రం కె. పద్మ(50) వారి నివాసం వైపు వచ్చింది. చాలా దూరం నుంచి వచ్చాను, అలసిపోయాను అంది. ఆ దంపతులు ఆమెకు ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు. భోజనం చేసి అందరూ పడుకున్నారు. దంపతులు ఉదయం లేచి చూసే సరికి పాప లేదు, ఆమె లేదు. దీంతో ఆ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే డీసీపీ ప్రకాశ్‌రెడ్డి, ఏసీపీ అశోక్‌కుమార్ నేతృత్వంలో 4 బృందాలు ఏర్పాటు చేసి ముమ్మరంగా గాలించారు. సీసీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్ట్టారు. ఎట్టకేలకు గచ్చిబౌలిలో తాగిన మైకంలో నిందితురాలు పట్టుబడింది. విచారణలో నేరం ఒప్పుకుంది. చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితురాలు పద్మను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

704
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles