మానసిక వికలాంగురాలిపై లైంగిక దాడి

Mon,May 27, 2019 10:08 PM

Sexual assault on mental health disability women

వలిగొండ: ఒంటరిగా ఇంట్లో నిద్రిస్తున్న మానసిక వికలాంగురాలిపై యువకుడి లైంగిక దాడి చేశారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని విద్యానగర్ కాలనీలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వలిగొండ మండల కేంద్రంలోని విద్యానగర్ కాలనీలో సరిగడ లింగయ్య, సరోజ దంపతులు నివాసముంటున్నారు. వీరి ఐదవ సంతానమైన కుమారి(19) మానసిక వికలాంగురాలు. కుమారి నిద్రిస్తుండగా ఇంటి పక్కనే ఉన్న మహేందర్ యువతిపై లైంగిక దాడి చేశారు. అదే సమయంలో బయటికి వెళ్లిన కుమారి తల్లి సరోజ ఇంట్లోకి రాగా ఇది గమనించిన మహేందర్ పారిపోయాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా ఘటనా స్థలానికి చేరుకొని బాధితురాలిని రామన్నపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మహేందర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు మహేందర్‌ను కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భువనగిరి -చిట్యాల ప్రధాన రహదారిపై సుమారు రెండు గంటలపాటు ధర్నా నిర్వహించారు. సమాచారం తెలుసుకున్న యాదాద్రి భువనగిరి జిల్లా డీసీపీ కే.నారాయణరెడ్డి, చౌటుప్పల్ ఏసీపీ సత్తయ్య, రామన్నపేట సీఐ శ్రీనివాస్, వలిగొండ ఎస్‌ఐ శివనాగ ప్రసాద్ బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

2612
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles