హైదరాబాద్ నుంచి పలు ప్రత్యేక రైళ్లు

Tue,July 23, 2019 10:47 PM

Several special trains from Hyderabad

హైదరాబాద్ : నగరంలోని కాచిగూడ, హైదరాబాద్, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి వివిధ ప్రాంతాలకు దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్ళను ప్రకటించింది. రద్దీ పెరుగుతుండటంతో వీటిని ప్రకటించినట్లు సీపీఆర్వో రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్ నుంచి కాంచీపురం మధ్య 16 సర్వీసులు నడిపిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ రైళ్లు సికింద్రాబాద్ స్టేషన్ నుండి జూలై 24 నుండి ఆగస్టు 16వ తేదీ వరకు బుధ, శుక్రవారాలలో సాయంత్రం 6.15 నిమిషాలకు బయలుదేరుతాయని తెలిపారు. అదేవిధంగా హైదరాబాద్ స్టేషన్ నుంచి విజయవాడకు 9 సర్వీసులను నడుపనున్నట్లు తెలిపారు. ఆగస్టు 5వ తేదీ నుంచి సెప్టెంబర్ 30 వరకు ప్రతీ సోమవారం 10.45 నిమిషాలకు నగరం నుంచి బయలుదేరుతుంది. అదేవిధంగా సికింద్రాబాద్ నుంచి గుంటూరు మీదుగా మచిలీపట్నానికి ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 29 వరకు ప్రతీ ఆదివారం ఉదయం 8.55 నిమిషాలకు ప్రత్యేక రైళ్లు బయలుదేరుతాయి. కాచిగూడ స్టేషన్ నుంచి కాకినాడ టౌన్‌కు 18 ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 27 వరకు ప్రతీ శుక్రవారం సాయంత్రం కాచిగూడ నుండి సాయంత్రం 6.45 నిమిషాలకు బయలుదేరుతాయి. సికింద్రాబాద్ నుంచి కాకినాడ టౌన్‌కు ఒక రైలు నడుస్తుందని అన్నారు. ఈ రైలు సాయంత్రం 9.40 నిమిషాలకు బయలుదేరుతుంది. కాచిగూడ నుండి తిరుపతికి కూడా ప్రత్యేక రైలు వేశారు. ఈ రైలు 26 జూలై సాయంత్రం 5.55 నిమిషాలకు బయలుదేరుతుందని ప్రకటనలో పేర్కొన్నారు.

662
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles