వికారాబాద్ జిల్లాలో పలువురు తహసీల్దార్లు బదిలీ

Wed,October 17, 2018 06:57 AM

Several MROs transferred in vikarabad District

వికారాబాద్ జిల్లా : జిల్లాలో పలువురు తహసీల్దార్లు బదిలీ అయ్యారు. ఎన్నికల సందర్భంగా జిల్లాలో మూడేళ్ల పాటు విధులు నిర్వహిస్తున్న తహసీల్దార్లను ప్రభుత్వం బదిలీ చేస్తూ ఆదేశాల జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం జిల్లాలో తొమ్మిది మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌త్రివేది ఆదేశాల జారీ చేశారు.

మర్పల్లి, తాండూరు, బొంరాస్‌పేట, బంట్వారం, ధారూరు, కోట్‌పల్లి, కులకచర్ల, బషీరాబాద్, యాలాల మండలాల తహసీల్దార్లను బదిలీ చేశారు. మర్పల్లి తహసీల్దార్‌గా పని చేస్తున్న కె. శ్రీనివాస్‌ను మహబూబ్‌నగర్ కు, అక్కడ పని చేస్తున్న ఆశాజ్యోతిని మర్పల్లి తహసీల్దార్‌గా నియమించారు. తాండూరు తహసీల్దార్ జి.రాములు స్థానంలో గోపాల్(మహబూబ్‌నగర్)ను నియమించారు. బొంరాస్‌పేట తహసీల్దార్ విద్యాసాగర్‌రెడ్డి స్థానంలో ఎంవీవీ ప్రసాదరావు (మహబూబ్‌నగర్)ను నియమించారు. బంట్వారం తహసీల్దార్ శహదాబేగం స్థానంలో లలితను నియమించారు. ధారూరు తహసీల్దార్ భీమయ్య స్థానంలో రాధాబాయిని, కోట్‌పల్లి తహసీల్దార్ బుచ్చయ్య స్థానంలో పి.దశరథ్‌ను, కులకచర్ల తహసీల్దార్ అశోక్ కుమార్ స్థానంలో నిజామాబాద్ జిల్లాలో పని చేస్తున్న ఎస్.రాములును, బషీరాబాద్ తహసీల్దార్ వెంకటయ్య స్థానంలో తౌఫిక్‌అహ్మద్ (నిజామాబాద్)ను నియమించారు. యాలాల తహసీల్దార్‌గా పని చేస్తున్న సి.శ్రీనివాస్‌రెడ్డిని నాగర్‌కర్నూల్ జిల్లాకు బదిలీ చేశారు. ఈయన స్థానంలో కొత్త తహసీల్దార్‌ను నియమించాల్సి ఉంది.

1255
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles