గుడి వద్ద జనంపైకి దూసుకెళ్లిన కారు...

Sat,May 25, 2019 08:21 PM

seven people injured in car accident

శ్రీశైలం: శ్రీశైలంలోని సాక్షి గణపతి ఆలయం వద్ద ప్రమాదం జరిగింది. గుడిలో పూజలు చేస్తున్న భక్తులపైకి కారు దూసుకెళ్లింది. ప్రమాదంలో సంగారెడ్డి జిల్లాకు చెందిన ఏడుగురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను శ్రీశైలం ఆలయం అంబులెన్స్‌లో సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూజారి సిద్దు ఆలయం ఎదుగురుగా తన కొత్త కారుకు వాహన పూజ చేశాడు. అనంతరం కారును ముందుకు తీసే క్రమంలో అదుపు తప్పి భక్తులపైకి దూసుకెళ్లింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

473
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles