అటవీ మార్గాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు: ఇంద్రకరణ్‌రెడ్డి

Fri,October 18, 2019 01:10 PM

మేడ్చల్‌: అటవీ మార్గాల్లో సీసీ కెమెరాలు పెట్టాల్సిన అవసరం ఉందని రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా దులపల్లి ఫారెస్ట్‌ అకాడమీలో అటవీ అధికారుల అర్థసంవత్సరం సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమీక్షకు అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అతి త్వరలో ఐదుగురు సభ్యుల కమిటీ భేటీ ఉంటుందన్నారు. ఆరు నెలలకోసారి అటవీశాఖపై సమీక్ష నిర్వహిచండం అభినందనీయమన్నారు. వన్యప్రాణుల రక్షణకు చర్యలకు తీసుకుంటునట్లు తెలిపారు.


చెట్ల నరికివేత‌, క‌ల‌ప అక్ర‌మ ర‌వాణాను అరిక‌ట్టేందుకు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామన్నారు. అడ‌వుల ప‌రిర‌క్ష‌ణ‌, ప‌చ్చ‌ద‌నం పెంచ‌డం, త‌దిత‌ర అంశాల‌పై ఈ నెల 28 న మంత్రుల క‌మిటీ స‌మావేశం జరుగుతుంది. విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అట‌వీ శాఖ‌ అధికారులు, సిబ్బందికి సర్వీస్ మెడల్స్ ను పునరుద్ధరిస్తామని వెల్లడించారు. వచ్చే జనవరి 26 నుంచి సేవ ప‌త‌కాలు ఇచ్చేలా చూస్తాం. ప్రతి 6 నెలలకు ఒకసారి అటవీశాఖ పై సమీక్ష నిర్వహించడం అభినందనీయం. జరిగిన పనుల సమీక్షకు, కొత్త ప్రణాళికలకు ఈ సమావేశాలు ఎంత‌గానో ఉపయోగప‌డ‌తాయి. పచ్చదనం పెంపుకు, పర్యావరణ సమతుల్యత కాపాడేందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.

388
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles