సరోగసి నిబంధనలకు కమిటీ ఏర్పాటు: లక్ష్మారెడ్డి

Thu,November 2, 2017 10:59 AM

Setting up a Committee on surrogacy says minister Lakshma Reddy

హైదరాబాద్: సరోగసి నిబంధనలు రూపొందించడం కోసం కమిటీ ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. రిటైర్డ్ జడ్జి జస్టిస్ గోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ వేశామన్నారు. రాష్ట్రంలో సరోగసి సెంటర్లు, సరోగసికి ప్రత్యేక చట్టం, అక్రమ సరోగసిపై చర్యలు వంటి తదితర అంశాలపై విపక్ష సభ్యులు చిన్నారెడ్డి, గీతారెడ్డి, పద్మావతి శాసనసభ ప్రశ్నోత్తరాల్లో భాగంగా అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ.. రాష్ట్రంలో 71 సంతాన సాఫల్య కేంద్రాలు, హైదరాబాద్‌లో 27 ఫర్టిలిటీ సెంటర్లు ఉన్నాయని తెలిపారు. అక్రమ సరోగసిపై చర్యలు తీసుకున్నామని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య సరోగసి నిర్వహించినందుకు బంజారాహిల్స్ సాయికిరణ్ ఆస్పత్రిపై క్రిమినల్ కేసు పెట్టినట్లు మంత్రి వెల్లడించారు.

2322
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles