కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు

Wed,July 24, 2019 10:36 AM

Service activities during the birthday of KTR

హైదరాబాద్: టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం పెద్దఎత్తున సేవాకార్యక్రమాలు నిర్వహించాలని ఆ పార్టీ శ్రేణులు నిర్ణయించాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలు, నియోజకవర్గాలు, మండలస్థాయిలో రక్తదాన శిబిరాలు, పేదలు, వృద్ధులు, అనాథలకు పం డ్లు, ఆహారం పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టారు. తన పుట్టినరోజున హంగుఆర్భాటాలు, అనవసర ఖర్చులు వద్దని, అవసరంలో ఉన్నవారికి సాయంచేయాలని పార్టీశ్రేణులు, అభిమానులకు కేటీఆర్ ఇప్పటికే పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కేటీఆర్ పిలుపు మేరకు పార్టీ శ్రేణులు, అభిమానులు విద్యార్థులకు, ప్రభుత్వ పాఠశాలలకు, వయో వృద్ధులకు తమ వంతు సాయం చేస్తున్నారు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కే.పి. వివేకానంద ఆధ్వర్యంలో కుత్బాల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో వెయ్యి మొక్కలు నాటారు. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా ముఖ్ర కె గ్రామ వైకుంఠదామంలో గ్రామస్తులు 500 మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గాడ్గె మీనాక్షి, ఎంపీటీసీ గాడ్గె సుభాష్, గ్రామస్తులు పాల్గొన్నారు.
521
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles