ఆ కేసులో పనిమనిషిదే కీలక పాత్ర..Mon,December 18, 2017 06:34 AM

ఆ కేసులో పనిమనిషిదే కీలక పాత్ర..


బంజారాహిల్స్ : ఏపీ శాసనసభ చీఫ్ విప్, సింగనమల ఎమ్మెల్యే యామినీ బాల నివాసంలో చోరీ కేసులో ఇద్దరు నిందితులను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీనగర్‌కాలనీలో నివాసం ఉంటున్న యామినీ బాల నివాసంలో సుమారు 25తులాల బంగారం మాయం అయినట్లు వారం రోజుల క్రితం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు అందింది. ఎమ్మెల్యే యామినీ బాల కుమార్తె ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.

ఇంట్లో పనిచేస్తున్న పనిమనిషి శోభారాణి పలు దఫాలుగా బంగారాన్ని తస్కరించినట్లు పోలీసుల విచారణలో తేలింది. దాంతో ఆదివారం సాయంత్రం నిందితురాలు శోభారాణి (27)తో పాటు అమెకు సహకరించిన రమ్య (22)అనే మహిళను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చాదర్‌ఘాట్ సమీపంలోని ఓ బస్తీలో నివాసం ఉంటున్న నిందితులిద్దరూ కలిసి బంగారా న్ని విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. కేసులో పూర్తి వివరాలను సోమవారం మీడియాకు వివరించే అవకాశం ఉందని తెలుస్తుంది.

1001
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS