తాగి వాహనం నడిపితే ఉద్యోగం ఊడుతుంది...

Sun,May 12, 2019 02:33 PM

series action take on drunk and drive case

హైదరాబాద్ : ఇకపై నుంచి ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ప్రైవేట్ ఉద్యోగులు కానీ మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడితే ఉద్యోగం కోల్పోయే ప్రమాదముంది. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ ఉద్యోగులకు సంబంధించి వారి శాఖ ఉన్నతాధికారులకు నోటీసులు ట్రాఫిక్ పోలీసులు పంపనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలుచోట్ల రెవెన్యూ, రోడ్లు, భవనాలశాఖల్లోని పలువురు ప్రభుత్వ ఉద్యోగులకు నోటీసులు అందాయి. తాగి వాహనాలు నడిపితే వారిని ఏకంగా కటకటాల వెనుకకు పంపండమే కాకుండా వారి ఉద్యోగం ఊస్టింగ్ అయ్యేలా పోలీసులు కఠిన చర్యలు తీసుకోనున్నారు.

నోటీసు సారాశం..


మీరు మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తూ ఫలానా చోట పట్టుబడ్డారు. మీ వాహనాన్ని సీజ్ చేసిన విషయం తెలిసిందే. కోర్టులో జరిమానా కూడా కట్టారు. మరోసారి ఈ పరిణామం చోటు చేసుకుంటే మీ ఉన్నతాధికారులకు సమాచారం వెళ్తుంది. మిమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగించే ప్రమాదముంది. అని నేరుగా ఆ శాఖ ఉన్నతాధికారులు పై విధంగా నోటీసులు పంపనున్నారు. కాగా కొందరు విద్యుత్ ఉద్యోగులు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే ఆ శాఖ ఉన్నతాధికారులకు పోలీసులు నేరుగా నోటీసులు పంపడం జరిగింది. ఇంతకుముందు మీ ఉద్యోగి మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డారు. ఇంకోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే వారికి ఉద్యోగానికి ఎసరు పడే ప్రమాదముంది. వాళ్లు తాగి వాహనం నడపడం ద్వారా వారి జీవితాలకే రిస్క్ వాటిల్లే ప్రమాదం ఉంది అంటూ పోలీసులు తమ సూచనల్లో పేర్కొన్న సంఘటనలు కూడా ఉన్నాయి.

ఉద్యోగం పోయే ప్రమాదం...


గతంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టగా అప్పడు వాహనదారులకు కేవలం జరిమానాలు వేసేవారు. కానీ రోజురోజుకీ వారి సంఖ్య పెరుగుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో ప్రస్తుతం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారికి జరిమానాతో పాటు జైలు శిక్ష విధించేలా చర్యలు కఠినం చేశారు. ఇప్పటికీ వాహనదారుల్లో మార్పు రాకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేట్ ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుని వారి ఉద్యోగం ఊడేలా చేస్తున్నారు. కేవలం ఉద్యోగస్తులే కాకుండా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించి తాగి వాహనాలను నడపొద్దంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. కాగా ప్రైవేట్ సంస్థలలో పని చేసే ఉద్యోగులు రెండుసార్లకు మించి డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే పోలీసులు ఇచ్చే కౌన్సిలింగ్‌కు (హెచ్‌ఆర్ మేనేజర్లు)ను పిలిపించాలని భావిస్తున్నట్లు సమాచారం.

2245
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles