చర్లపల్లి జైలు వద్ద పటిష్ట బందోబస్తు

Thu,December 5, 2019 06:44 AM


చర్లపల్లి : ‘దిశ’ హత్య కేసులో నిందితులు చర్లపల్లి కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న నేపథ్యంలో కారాగారం వద్ద స్థానిక పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. శంషాబాద్‌ ఘటనలో సాముహిక లైంగిక దాడికి పాల్పడి..హత్య చేసిన ఘటనలో కోర్టు ఆదేశాల మేరకు చర్లపల్లి కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న నలుగురు నిందితులు హైసెక్యూరిటీ బ్యారక్‌లో ఉన్నారు. నలుగురు నిందితులు ఒకే చోట ఉంటే ఇబ్బందులు తలెత్తుతాయని భావించిన అధికారులు..ఒక్కొక్కరిని ఒక్కో బ్యారక్‌లో ఉంచినట్లు తెలిసింది. కేంద్ర కారాగారం వద్ద ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జైలు వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేయడం తో పాటు ఇతర ఖైదీలను కలుసుకునేందుకు వచ్చే ఖైదీల బంధువులను క్షుణ్ణంగా పరిశీలించి ములాఖాత్‌కు అనుమతిస్తున్నారు.


బుధవారం నిందితులకు పప్పు సాంబర్‌, కర్రీతో భోజనం అందించినట్లు సమాచారం. నిందితులను కస్టడీకి తీసుకునేందుకు షాద్‌నగర్‌ పోలీసులు... కేంద్ర కారాగారంకు వస్తున్నారనే సమాచారంతో మీడియా ప్రతినిధులు జైలు వద్దకు భారీగా చేరుకున్నారు. అంతో అప్రమత్తమైన పోలీసులు జైలులోకి ఎవ్వరినీ అనుమతించకుండా తగు చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా జైలు పరిసరాల్లో ఆంక్షలు విధించారు.

నిందితులకు ఖైదీల దుస్తులు..


చర్లపల్లి కేంద్ర కారగారంలో శిక్ష అనుభవిస్తున్న ‘దిశ’ నిందితులకు కేంద్ర కారగారంలో జీవిత ఖైదుగా శిక్ష అనుభవించే ఖైదీల దుస్తులను సమకూర్చినట్లు తెలిసింది. నిందితులను కలుసుకోవడానికి వారి కుటుంబ సభ్యులు రాకపోవడం, దుస్తులు లేకపోవడంతో జైలు అధికారులు ఆ దుస్తులను అందించినట్లు సమాచారం. అదేవిధంగా కేంద్ర కారాగారం సిబ్బంది నిందితులు ఉండే బ్యారక్‌కు వెళ్లకుండా జైలు అధికారు లు తగు ఆంక్షలు విధించిన్నట్లు సమాచారం. అదేవిధంగా సమాచారాన్ని మీడియా ప్రతినిధులకు ఇవ్వకుండా సిబ్బందికి ఆంక్షలు విధించిన్నట్లు సమాచారం.

943
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles