లెవల్ క్రాసింగ్ గేట్ల వద్ద భద్రతపై ఆరా

Sat,August 17, 2019 10:28 PM

Security check at Level Crossing Gates

హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్య శనివారం సికింద్రాబాద్- బొల్లారం- మేడ్చల్ సెక్షన్ మధ్య ఉన్న లెవల్ క్రాసింగ్ గేట్ల వద్ద భద్రతా ప్రమాణాలను తనిఖీచేశారు. మొదట లాలాగూడ లెవల్ క్రాసింగ్ గేట్ వద్ద పురోగతిలో ఉన్న రోడ్ అండర్ బ్రిడ్జి పనులను సమీక్షించి నిర్మాణం త్వరగా పూర్తిచేసేందుకు అనుసరించాల్సిన ప్రణాళికపై అధికారులతో చర్చించారు. మల్కాజిగిరి, సఫిల్‌గూడ, బొల్లారం, గుండ్ల పోచంపల్లి, గౌడవల్లి, మేడ్చల్ మార్గంలో కాపలా ఉన్న లెవల్ క్రాసింగ్ గేట్లను తనిఖీచేశారు. భద్రతా నియమాలను పాటించడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గేట్‌మన్‌లతో సంభాషించారు. బొల్లారం రైల్వే స్టేషన్‌లో స్టేషన్‌మాస్టర్ కార్యాలయాన్ని, గుండ్లపోచంపల్లి స్టేషన్ పరిసరాలను పరిశీలించి ప్రయాణికుల వసతుల అభివృద్ధికి చేపటట్టాల్సిన ప్రణాళికపై అధికారులతో చర్చించారు. పర్యటనలో హైదరాబాద్ డివిజన్ డీఆర్‌ఎం సీతారాంప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

479
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles