జూలై 7 నుంచి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి జాతర

Thu,June 13, 2019 07:44 AM

Secunderabad Ujjaini Mahankali Janatha From 7th July 2019

హైదరాబాద్ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాన్ని ప్రతిబింబించే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆషాఢ బోనాల జాతరను వైభవంగా నిర్వహించేందుకు అధికారులు పకడ్బందీగా అన్ని ఏర్పాట్లుచేయాలని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆదేశించారు. మహంకాళి అమ్మవారి బోనాల నిర్వహణకు ఎన్ని నిధులైనా ప్రభుత్వం వెచ్చిస్తుందని, బోనాలకు వచ్చే లక్షలమంది భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. బోనాలను పురస్కరించుకుని దేవాలయ ఈవో అన్నపూర్ణ, వేదపండితులు గచ్చిబౌలిలోని క్యాంపు కార్యాలయంలో ఇంద్రకరణ్‌రెడ్డిని కలిసి ఆహ్వానపత్రికను అందజేశారు. ఏర్పాట్ల గురించి మంత్రికి వివరించారు. జూలై 7 నుంచి 22 వరకు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర జరుగనున్నదని, 7న ఘటం, ఎదుర్కోలు, 21న బోనాలు, 22న రంగం ఉంటుందని తెలియజేశారు. భక్తులకు తాగునీటి ప్యాకెట్లను, ప్రసాదాలను అందుబాటులో ఉంచాలని ఇంద్రకరణ్‌రెడ్డి దేవాదాయశాఖ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా వేదపండితులు మంత్రి అల్లోలను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో అన్నపూర్ణ, వేదపండితులు పాల్గొన్నారు.

835
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles