మధ్యాహ్నం 1 గంట వరకు నమోదైన పోలింగ్ శాతం...

Fri,May 10, 2019 02:01 PM

second phase MPTC and ZPTC polling Percentage up to 1 pm

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగియనుంది. మిగితా ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. మధ్యాహ్నం 1 వరకు వివిధ జిల్లాల్లో నమోదైన పోలింగ్ వివరాలు... నాగర్‌కర్నూల్ 57.39 శాతం, నల్లగొండ 62.21 శాతం, సూర్యపేట 66.54 శాతం, భద్రాద్రి కొత్తగూడెం 65.09 శాతం, కామారెడ్డి 64.95 శాతం, ఖమ్మం 60.25 శాతం, రంగారెడ్డి-64.29 శాతం, యాదాద్రి భువనగిరి 61.63 శాతం, జనగామ 58.32 శాతం, మహబూబాబాద్ 58.81శాతం, ఆదిలాబాద్ 56.50 శాతం, వనపర్తి 52.37 శాతం పోలింగ్ నమోదైంది.

935
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles