బొలెరో ఢీకొని విద్యార్థిని మృతి

Thu,September 19, 2019 06:31 PM

హైదరాబాద్ : కూకట్‌పల్లి పరిధిలోని ఏవీబీ పురంలో గురువారం సాయంత్రం రోడ్డుప్రమాదం జరిగింది. బొలెరో వాహనం ఢీకొని విద్యార్థిని రిషిత మృతి చెందింది. పాఠశాలకు వెళ్లిన చిన్నారి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బాలిక తలకు తీవ్ర గాయాలు కావడంతో.. ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. విద్యార్థిని రిషిత సెయింట్ రిటా హైస్కూల్‌లో రెండో తరగతి చదువుతోంది. రిషిత తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

741
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles