పాఠశాల ఫీజుల ఖరారుపై కసరత్తు

Sat,July 1, 2017 07:11 AM

school fees finalized in telangana

హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల ఫీజులపై ఏర్పాటైన ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రైవేటు పాఠశాలలు వసూలుచేస్తున్న ఫీజుల వివరాలను సేకరించాలని నిర్ణయించింది. అందుకోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నారు. గత మూడేండ్ల నుంచి వసూలుచేస్తున్న ఫీజుల వివరాలను ప్రతి ప్రైవేటు పాఠశాల డీఈవో ఆధ్వర్యంలో ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పాఠశాలల్లో 30శాతం వరకు అధిక ఫీజులను వసూలు చేస్తున్నారని, ఏటా కనీసం 20 శాతానికి పైగా పెంచుతున్నారని, వీటిని నియంత్రించడం కోసం వెబ్‌సైట్ ద్వారా ఫీజుల వివరాలను సేకరించాలని నిర్ణయించామని ఆయన తెలిపారు.

755
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles