‘లిటిల్ హార్ట్స్‌’కు ఎంత కష్టమొచ్చింది..!

Mon,August 17, 2015 06:45 AM

school children's have heart problems

బరువు మోస్తున్న బాల్యం
ఎల్‌కేజీలోనే ఐదు కేజీల పుస్తకాల మోత
చిన్నారుల ఎదుగుదలపై ప్రభావం


హైదరాబాద్ : హాయిగా ఆడుకునే చిన్నారులు.. తమ వయస్సు మించి బరువును మెస్తున్నారు.. కొన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఎల్‌కేజీ, యూకేజీలోనే హోంవర్స్ నోట్స్, డ్రాయింగ్ బుక్స్ ఇలా కేజీల కొద్ది పుస్తకాల సంఖ్య పెంచేయడంతో రోజూ స్కూలుకు వాటిని తేలేక పిల్లలు అవస్థలు పడుతున్నారు.. ఎల్‌కేజీలోనే ఐదు కేజీల భారాన్ని మోసుకొస్తున్నారు.. హ్యాపీగా ఆడుకుంటామన్నా.. చదువు చదువు అంటూ.. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఒత్తిడితో సతమతమవుతున్నారు.. తమ బాధ ఎవరికీ చెప్పుకోలేక మనస్సులో మదపడిపోతున్నారు లిటిల్ హార్ట్స్.

ప్రస్తుతం హైటెక్ యుగం.. కాలంతో పరుగెత్తి రావాల్సి వస్తోంది. ఇదే పిల్లల పాలిట శాపంగా మారింది. ఎల్‌కేజీ నుంచి ఐదో తరగతి వరకు పుస్తకాల బరువు మోయలేకపోతున్నారు. అభం..శుభం తెలియని వయస్సులో పిల్లలకు ఆ నోట్సు.. ఈ నోట్సు అంటూ పాఠశాల యాజమాన్యం నిబంధనల మేరకు చిన్న వయస్సులోనే బరువు మోయాల్సిన పరిస్థితి. హోమ్ వర్క్, క్లాస్ వర్క్ ఫేయిర్ నోట్సు పేరిట పేజీలకు పేజీలు రాయిస్తున్నారు. హోంవర్క్ చేయకపోతే ఇక బెత్తం దెబ్బలు తప్పడం లేదు.

మార్కుల కోసం ఒత్తిడి..
కొందరు తల్లిదండ్రులు సైతం తమ పిల్లవాడికి మార్కులు బాగా రావాలని మా చంటి గాడికి అంత ర్యాంకు రావాలి.. మా బంటిగానికి అంత మార్కులు రావాలని ఆలోచిస్తున్నారే తప్ప.. పిల్లల పడుతున్న శ్రమను గుర్తించలేకపోతున్నారు.. పిల్లలు మాత్రం దేవుడా.. మాకీ కర్మ ఏంటని బుడిబుడి నడకలు నడుస్తూ.. పాఠశాలలకు వెళ్తున్నారు.

పుస్తకాల బరువు తమ వయస్సుకు మించి పోతుండడంతో పిల్లలు 14 సంవత్సరాలలోపే అనేక రకలైన వెన్ను సమస్యలతో బాధపడుతున్నారు. మాములుగానైతే విద్యార్థి దశలో తన బరువులో 15 శాతం కన్నా వారి పుస్తకాల బ్యాగ్ బరువు పెరగకుండా చూసు కోవాలి. కాని అందుకు బిన్నంగా అధిక బరువులు మోస్తూ అనారోగ్యాల పాలవుతున్నారు. తల్లిదండ్రలూ మీ చిన్నారుల పట్ల బీకేర్‌ఫుల్.

school children

వెన్ను పూసపై తీవ్ర ప్రభావం: డాక్టర్ అరవింద్ గండ్ర, స్పైన్ సర్జన్
మన శరీరం నిలువుగా ఉండేందుకు దోహదపడేది వెన్ను పూస. దానికి ఏ మాత్రం కష్టం వచ్చినా ఇబ్బందులు తప్పవు. వెన్నులో 33 వెన్ను పూసలు, ఎముక గూడుకండరాలతో నిర్మితమవుతుంది. ఇవి ఒక దానికి మరొకటి నిలువుగా వెన్నుపూస మోండెంకు స్థిరత్వాన్ని, కదిలే గుణాన్ని కలిగిస్తూ.. మన సున్నితమైన నరాలను రక్షిస్తుంది.

ఈ క్రమంలో చిన్న వయస్సు నుంచి ఎదిగే 15 సంవత్సరాలల్లోపు పిల్లలకు వారి శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ సమయంలో రెండు భూజాలపై బరువులు మోస్తే వెన్నుపూస వంగిపోయే ప్రమాదం లేకపోలేదు. అందుకే తల్లిదండ్రులు ఎప్పుడు మార్కులపై దృష్టి పెట్టకుండా తమ పిల్లలకు ఆరోగ్యవంతమైన జీవితాన్ని అందించేందుకు ధ్యాస పెట్టాలి.

స్కూల్ బ్యాగు ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్దవి కొనకుండా చిన్న సైజు బ్యాగులను ఎంపిక చేసుకోవాలి. పిల్లల బరువులో 15 శాతం కన్నా బ్యాగ్ బరువు మించకూడదు. బాలబాలికలు 20 కిలోల బరువు ఉంటే వారి బ్యాగ్ మూడు కిలోల లోపు మాత్రమే ఉండాలి. 30 కేజీలు ఉంటే బ్యాగ్ బరువు బ్యాగ్ 4 కిలోలు ఉండాలి. 40 కిలోలకు పుస్తకాల మోత 6 కిలోలు దాటవద్దు.

బ్యాగు రెండు భూజాలకు వేసుకోవాలి. ఒక భూజానికి వేసుకోవడం మంచిది కాదు. పుస్తకాలు ఎక్కువగా ఉంటే టీచర్ల సలహాతో ఆ రోజు కావాల్సిన పుస్తకాలను తీసుకెళ్లడం వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది. బ్యాగును నడుము వరకు వేలాదీయకుండా చూసుకోవాలి. పిల్లలకు బలవర్ధకమైన ఆహారం అందిస్తూ శారీరక వ్యాయామం సైతం చేయిస్తే బరువు మోసినా దుష్ప్రభావాల అంతగా పడకుండా రక్షించుకోవచ్చు.

1950
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles