సీజే లైంగిక వేధింపుల కేసులో లాయ‌ర్‌కు నోటీసులు

Tue,April 23, 2019 12:12 PM

SC issues notice to lawyer claiming to have been offered Rs 1.5 crore to frame CJI

హైద‌రాబాద్‌: చీఫ్ జ‌స్టిస్ రంజ‌న్ గ‌గోయ్‌పై లైంగిక వేధింపుల కేసును న‌మోదు చేయాల‌ని ఓ వ్య‌క్తి త‌న‌ను ఆశ్ర‌యించిన‌ట్లు న్యాయ‌వాది ఉత్స‌వ్ బెయిన్స్ సుప్రీంకోర్టులో పిల్ వేశారు. సీజేఐపై న‌కిలీ లైంగిక వేధింపుల కేసును న‌మోదు చేస్తే 1.5 కోట్లు ఇస్తాన‌ని అజ‌య్ అనే వ్య‌క్తి ఆశ్ర‌యించిన‌ట్లు ఉత్స‌వ్ త‌న పిల్‌లో తెలిపారు. దీనిపై జ‌స్టిస్ మిశ్రా నేతృత్వంలోని ప్ర‌త్యేక బెంచ్‌.. న్యాయ‌వాది ఉత్స‌వ్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఈనెల 24వ తేదీన కోర్టుకు వ్య‌క్తిగ‌తంగా హాజ‌రుకావాల‌ని న్యాయ‌వాది ఉత్స‌వ్‌ను ఆదేశించారు. ధ‌ర్మాస‌నంలోని జ‌స్టిస్ రోహింగ్ట‌న్ నారీమ‌న్‌, దీప‌క్ గుప్తాలు కూడా ఉన్నారు. పిల్ వేసిన న్యాయ‌వాది కోర్టురూమ్‌లో లేక‌పోవ‌డంతో బెంచ్ ఈ ఆదేశాలు జారీ చేసింది. చీఫ్ జ‌స్టిస్ గ‌గోయ్ త‌న‌ను లైంగికంగా వేధించిన‌ట్లు ఓ మాజీ ఉద్యోగిని సుప్రీం న్యాయ‌మూర్తుల‌కు లేఖ‌లు రాసిన విష‌యం విదిత‌మే.

2023
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles