కూలిన ఎస్‌బీఐ బ్యాంకు పైకప్పు..

Thu,June 7, 2018 03:56 PM

sbi building roof collaps in sultanabad

పెద్దపల్లి: బ్యాంకులో లావాదేవీలు నిర్వహించడానికి వచ్చిన ఖాతాదారులకు చేదు అనుభవం ఎదురైంది. పెద్ద‌పల్లి జిల్లా సుల్తానాబాద్‌లోని ఎస్‌బీఐ బ్యాంకు భవనం పై కప్పు కూలడంతో ఖాతాదారులు పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ఘటనలో ఆరుగురు ఖాతాదారులకు తీవ్ర గాయాలయ్యాయి. మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి పైకప్పు బాగా నాని గురువారం కూలింది. ఘటనలో గాయపడిన వారిని కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు.

1199
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles