ఎస్‌బీఐ డిబెట్ కార్డ్ పిన్ పొందండిలా...

Mon,July 9, 2018 02:30 PM

SBI ATM Debit Card Pin Generation through SBI Green Pin process

హైదరాబాద్ : ఎస్‌బీహెచ్ బ్యాంకు వినియోగదారులకు డిబెట్ కార్డు గడువు తేదీ ముగిసిన అనంతరం కొత్తగా ఎస్‌బీఐ డిబెట్ కార్డు వస్తుంది. దానికి సంబంధించిన పిన్ నంబర్‌ను మనం బ్యాంకు బ్రాంచ్‌కు వెళ్లి తీసుకోవాల్సి ఉంటుంది. ఏటీఎం కార్డు మనకు చేరుతుంది కాని బ్యాంకు బ్రాంచ్‌కు ఏటీఎం పిన్ చేరడం లేదు. ఎన్నిసార్లు వెళ్లిన వినియోగదారులకు ఇంకా మీ ఏటీఎం పిన్ రాలేదనే సమాధానం బ్యాంకు సిబ్బంది నుంచి వస్తుంది. దీనికి విడుగుడుగా మనం ఇంటర్‌నెట్, ఏటీఎం, ఐవీఆర్ ద్వారా ఏటీఎం డిబెట్ కార్డు పిన్ పొందవచ్చు.

ఎలాగంటే...


ఎస్‌ఎంఎస్ ద్వారా డిబెట్ కార్డు పిన్:


స్టెప్ 1: మీరు బ్యాంకులో నమోదు చేసిన ఫోన్ నెంబర్ నుంచి కింది విధంగా 567676 నెంబర్‌కు ఎస్‌ఎమ్‌ఎస్ పంపించండి
PINXXXXYYYY
*XXXX ఉన్న ప్రాంతంలో డిబెట్ కార్డుపై ఉన్న చివరి నాలుగు అంకెలు

*YYYY ఉన్న ప్రాంతంలో మీ అకౌంట్‌లోని చివరి నాలుగు అంకెలు నమోదు చేయాల్సి ఉంటుంది.
ఉదాహరణకు: PIN 7891 1234
స్టెప్ 2: మీరు బ్యాంకులో నమోదు చేసుకున్న సెల్‌ఫోన్ నెంబర్‌కు నాలుగు అంకెల వన్ టైమ్ పాస్ వర్డ్ వస్తుంది. ఈ పాస్‌వర్డ్‌ను ఓటీపీ వచ్చిన 48 గంటల్లో వినియోగించుకోవాల్సి ఉంటుంది.

ఐవీఆర్ ద్వారా డిబెట్ కార్డు పిన్ పొందండిలా....


స్టెప్ 1: మీరు ఎస్‌బీఐ బ్యాంకులో నమోదు చేసుకున్న మొబైల్ నంబర్ నుంచి 1800112211, 18004253800 కాల్ చేయండి.
స్టెప్ 2: బీప్ శబ్ధం అనంతరం మీ డిబెట్ కార్డుపై ఉన్న 16 అంకెలను నమోదు చేయండి
స్టెప్ 3: అనంతరం మీ ఎస్‌బీఐ అకౌంట్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
స్టెప్ 4: బ్యాంకులో నమోదు చేసుకున్న ముబైల్ నెంబర్‌కు ఎస్‌ఎంఎస్ ద్వారా నాలుగు అంకెల వన్ టైమ్ పాస్‌వర్డ్ వస్తుంది. అదే మీ కొత్త పాస్‌వర్డ్. దానిని ఉపయోగించిన అనంతరం ఏటీఎంలో మీ కొత్త పాస్‌వర్డ్‌ను క్రియోట్ చేసుకోండి.

5407
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles