ప్రిన్స్ స‌ల్మాన్‌కు బంగారు తుపాకీ గిఫ్ట్ ఇచ్చిన పాక్‌

Thu,February 21, 2019 11:32 AM

Saudi Prince Mohammed Bin Salman presented gold plated Submachine Gun by Pakistan

హైద‌రాబాద్: ఇండియా ప‌ర్య‌ట‌న క‌న్నా ముందు.. సౌదీ అరేబియా రాజు మ‌హ్మ‌ద్ బిన్ స‌ల్మాన్ పాకిస్థాన్‌కు వెళ్లారు. అక్క‌డ ఆయ‌న రెండు రోజులు ప‌ర్య‌టించారు. ఆ స‌మ‌యంలో పాక్ ఎంపీలు కొంద‌రు ప్రిన్స్ స‌ల్మాన్‌కు ఓ గ‌న్‌ను బ‌హూక‌రించారు. బంగారు పూత‌తో త‌యారైన ఆ గ‌న్‌ను స‌ల్మాన్‌కు గిఫ్ట్‌గా ఇచ్చారు. జ‌ర్మ‌నీ ఇంజినీర్లు త‌యారు చేసిన హెక్ల‌ర్ అండ్ కోచ్ ఎంపీ5 స‌బ్‌మెషీన్ గ‌న్‌ను ప్రిన్స్ స‌ల్మాన్‌కు పాక్ ఎంపీలు కానుక‌గా ఇచ్చారు. దీనిపై అర‌బ్ దేశాల్లో ఆందోళ‌న వ్య‌క్తం అవుతున్న‌ది. ఇటీవ‌ల సౌదీ జ‌ర్న‌లిస్టు జ‌మాల్ ఖ‌షోగ్గి హ‌త్య‌కు గురైన విష‌యం తెలిసిందే. ఆ జ‌ర్న‌లిస్టును ప్రిన్స్ స‌ల్మాన్‌నే చంపించాడ‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. స‌ల్మాన్‌ను అత్యున్న‌త పౌర స‌త్కారంతోనూ పాక్ సన్మానించింది.

2197
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles