దేశంలోనే సీఎం కేసీఆర్ పాలన ఆదర్శం : లక్ష్మారెడ్డి

Wed,May 3, 2017 08:16 PM

sarvepalli radhakrishnan statue inaugurated by Minister Laxma reddy

మహబూబ్‌నగర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. జడ్చర్ల పట్టణంలోని ఎమ్మార్సీ భవనం ఆవరణలో పీఆర్‌టీయూ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరై విగ్రహావిష్కరణ చేశారు. అనంతరం చంద్రాగార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌రెడ్డి సన్మాన సభకు ముఖ్యఅథితిగా హాజరై మాట్లాడారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల పరిపాలన గాడితప్పి అస్తవ్యస్తంగా మారిందన్నారు. ఉద్యోగులు ఎదురు చూసిన హెల్త్ స్కీం పాలసీని సీఎం కేసీఆర్ సహకారంతో అమలు చేస్తున్నామని తెలిపారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకించి ఒక సీఈవోను నియమించడంతోపాటు కార్యాలయం కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలోని పలుచోట్ల వెల్‌నెస్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగా ప్రస్తుతం రెండు సెంటర్లు పనిచేస్తున్నాయని తెలిపారు.

956
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles