50 లక్షలతో పట్టుబడ్డ సర్వే సత్యనారాయణ అనుచరుడు

Thu,December 6, 2018 12:43 PM

Sarve Satyanarayana Follower arrested with 50 lakhs in nampally

హైదరాబాద్ : కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణకు చెందిన రూ. 50 లక్షల నగదును పోలీసులు సీజ్ చేశారు. సర్వే సత్యనారాయణ ప్రధాన అనుచరుడు కాంగ్రెస్ నేత గాలి బాలాజీ వద్ద రూ. 50 లక్షలు, కాంగ్రెస్ ప్రచార సామాగ్రిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సర్వే సత్యనారాయణ ఆదేశాల మేరకు బేగంబజార్‌లోని హవాలా డీలర్ దిలీప్ నుంచి రూ. 50 లక్షలు తీసుకొని గాలి బాలాజీ అనే వ్యక్తి కంటోన్మెంట్‌కు బయల్దేరాడు. ఏపీ 09 బీఏ 4646 ఇన్నోవా వాహనంలో సర్వే సత్యనారాయణ కోసం బేగంబజార్ నుంచి డబ్బులు తీసుకెళ్తుండగా నాంపల్లి వద్ద పోలీసులు పట్టుకున్నారు.

4017
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles