సర్పంచ్, ఉప సర్పంచులుగా పలువురి ఏకగ్రీవ ఎన్నిక

Sun,January 6, 2019 04:18 PM


హైదరాబాద్ : పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం ఖరారవడం, రిజర్వేషన్ల కేటాయింపులు పూర్తవడంతో రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లోని గ్రామాల్లో సర్పంచులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు. తాజాగా వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలం శాంతినగర్ లో సర్పంచ్ గా బాసాని వేలాంగిణి మేరీని, వార్డు సభ్యులుగా కొమ్మారెడ్డి ఆనంద్ రెడ్డి, సింగారెడ్డి జ్యోతి, గోపు జోజిరెడ్డి, బాసాని మేరీలమ్మలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం చాకలి గుడిసెలు గ్రామంలో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను సర్పంచ్, ఉప సర్పంచులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సర్పంచ్ గా పూజిత, ఉప సర్పంచుగా సత్యనారాయణలను ఈ మేరకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

జగిత్యాల జిల్లా కథలపూర్ మండలం రాజారాం తండా సర్పంచ్ గా లౌడియా సరిత, ఉప సర్పంచుగా ఇస్లావత్ చంద్రు నాయక్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బుగ్గ రాజేశ్వర తండా సర్పంచ్ సహా పాలకవర్గం ఎన్నిక ఏకగ్రీవం చేశారు. గ్రామ సర్పంచ్ గా అజ్మీరా తిరుపతి నాయక్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

5200
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles