
పెద్దపల్లి జిల్లాలో అభ్యర్థి వినూత్న ప్రచారం..పెద్దపల్లి: జిల్లాలో పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. పెద్దపల్లి మండలంలోని పెద్ద కల్వల గ్రామపంచాయతీ సర్పంచ్ బరిలో నిలిచిన కల్వల రమేశ్ వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తూ అందరిని ఆకట్టుకుంటున్నాడు. రమేశ్ అతని భార్య వసంతతో కలిసి గ్రామంలోని ఓటర్ల కాళ్లు కడుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.