సర్పంచ్ అభ్యర్థి అపహరణ

Wed,January 9, 2019 12:33 PM

sarpanch candidate kidnaped in vikarabad

వికారాబాద్: వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం నీటూరు గ్రామంలో ఓ వ్యక్తి అపహరణకు గురయ్యారు. సర్పంచ్ పదవికి పోటీ పడుతున్న అభ్యర్థి విశ్వనాథంను దుండ‌గులు కిడ్నాప్ చేశారు. మంగ‌ళ‌వారం రాత్రి విశ్వ‌నాథంను గుర్తు తెలియ‌ని వ్యక్తులు కిడ్నాప్ చేసి ఉంటార‌ని కుటుంబ స‌భ్యులు అనుమానిస్తున్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు చోటుచేసుకోకుండా ఉండేందుకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికల తొలి విడుతకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ బుధవారంతో ముగియనున్నది. బుధవారం సాయంత్రం ఐదు గంటలవరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.

1881
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles