టీటీడీబోర్డు మెంబర్‌గా సండ్ర నియామకం రద్దు

Fri,February 15, 2019 09:26 PM

అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సభ్యుడిగా తెలంగాణ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య నియామకాన్ని రద్దుచేస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. నిబంధనల ప్రకారం నెలరోజుల్లో బాధ్యతలు తీసుకోవాల్సి ఉండగా.. ఇప్పటివరకు చేపట్టకపోవడంతో పాలకమండలి నుంచి ఆయన్ను తొలగిస్తున్నట్టు ఉత్తర్వులు జారీచేసింది. సండ్ర వెంకటవీరయ్య తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్ల్లో ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ తరువాత టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఆయన టీటీడీ బోర్డు సభ్యత్వాన్ని రద్దుచేయడం ప్రాధాన్యం సంతరించుకున్నది.

2241
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles