అత్యాచారం జరిగినట్లు ఆధారాలు లేవు: సందీప్‌శాండిల్యWed,September 13, 2017 04:42 PM

sandeep sandilya says about chandini jain case


హైదరాబాద్: మదీనాగూడలో అదృశ్యమైన చాందినీ జైన్ హత్యకేసు వివరాలను సైబరాబాద్ సీపీ సందీప్ శాండిల్య వెల్లడించారు. విద్యార్థిని చాందిని జైన్‌పై అత్యాచారం జరిగినట్లు ఆధారాలు లేవని సందీప్ శాండిల్య తెలిపారు. ప్రస్తుతానికి దీనిని హత్యకేసుగానే పరిగణిస్తున్నామని, ఫోరెన్సిక్ నివేదిక వస్తే ఈ కేసుకు సంబంధించి అన్ని విషయాలు తెలుస్తాయని ఆయన వెల్లడించారు. బాలిక వెళ్లినట్లు తెలిసిన మార్గంలోని సీసీ కెమెరాల పుటేజీని సేకరించినట్టు పేర్కొన్నారు. చాందినీ ఫోన్ కాల్స్ లిస్టును నిశితంగా పరిశీలించామని..హత్య కేసును చేధించేందుకు 16 బృందాలు రంగంలోకి దిగాయని సందీప్‌శాండిల్య తెలిపారు. చాందినీ జైన్‌ను తన ప్రియుడు సాయికిరణ్ హత్యచేసినట్లు పోలీసులు నిర్ధారించిన విషయం తెలిసిందే.

1982
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS