భానుడి భగభగ.. నెమలికి సెలైన్..

Sat,May 11, 2019 03:22 PM

saline water injected to National Bird peacock in Janagama

రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగకు జనాలతో పాటు మూగ జీవాలు విలవిలలాడిపోతున్నాయి. ఉష్ణతాపం నుంచి ఉపశమనం పొందేందుకు మూగజీవాలు పడరాని ఇబ్బందులు పడుతున్నాయి. ఎక్కడైనా నీరు కనబడితే చాలు.. అక్కడ వాలిపోతున్నాయి. జనగామ శివారులో జాతీయ పక్షి నెమలి వేడిగాలులను తట్టుకోలేకపోయింది. ఓ బోరు వద్ద వస్తున్న నీటి వద్దకు వెళ్లి.. కాసేపు సేదతీరింది. అయినప్పటికీ అది స్పృహ కోల్పోయింది. స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలోని అంబులెన్స్‌ సిబ్బంది ఆ నెమలికి చికిత్స అందించింది. ఆ నెమలికి సెలైన్ ఎక్కించి ఉష్ణతాపం నుంచి ఉపశమనం కలిగించారు.
2682
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles