విద్యార్థుల భద్రత... మన బాధ్యత

Sun,June 18, 2017 08:36 AM

safety of the students our responsibility

ప్రైవేట్ విద్యాసంస్థల బస్సులు రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒకచోట నిత్యం ప్రమాదానికి గురికావడం. విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం లేదా గా యాలపాలవడం తరుచూ చూస్తూనే ఉన్నాం. ప్రమాదాలు జరిగిన వెంటనే అధికారులు హడావుడి చేయడం.. సంబంధిత విద్యాసంస్థల యాజమాన్యాలను ప్రశ్నించడం, లేకుంటే వాహనాలను సీజ్‌చేయడం చూస్తుంటాం. ఆ తర్వాత అన్ని మరిచిపోవడం షరామామూలే.. ప్రభు త్వం, రవాణాశాఖ అధికారులు శాశ్వత పరిష్కారం కనిపెట్టినా విద్యాసంస్థల యాజమాన్యాలు, తల్లిదండ్రులు సహకరించడం లేదనే ఆరోపణలున్నాయి. ఫీజులతో పాటు చదువుపై పెట్టిన శ్రద్ధ విద్యార్థుల ప్రాణాలపై పెట్టడంలేదనే విమర్శలున్నాయి. ఆటోల్లో పరిమితికి మించి విద్యార్థులను కూర్చోపెట్టి పాఠశాలకు పంపించడం మా నుకోవాలని అధికారులు పదేపదే పాఠశాలల యాజమాన్యాలను, తల్లిదండ్రులను హెచ్చరిస్తూనే ఉన్నారు. డ్రైవర్ రాలేదని మూడేళ్ల కిందట ఓ జిల్లాలో ఒక ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం బస్సును అటెండర్‌తో డ్రైవింగ్ చేయించింది. దీంతో బస్సు బోల్తాకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృత్యువాత పడగా ఓ విద్యార్థిని చేయి పూర్తిగా తొలగించారు. మరో 20 మందికి పైగా విద్యార్థులకు గాయాలయ్యాయి. జిల్లాలో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా రాష్ట్ర సర్కా ర్, రవాణా శాఖ నిబంధనలను కఠినతరం చేసి అమలు చేసింది. ఫలితంగా గత ఏడాది పాఠశాల బస్సు ఏ ఒక్కటి కూడా ప్రమాదానికి గురికాలేదు. అదే స్ఫూర్తితో ఈ ఏడాది ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు, డ్రైవర్లు, తల్లిదండ్రులు, విద్యార్థులకు రవాణా శాఖ అవగాహన కల్పిస్తున్నారు.


తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
* పిల్లలు రోడ్డు దాటేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేయాలి.
* ప్రమాద రహిత మార్గాల్లోనే పాఠశాలకు పంపించే ఏర్పాటు చేయాలి.
* ఆటోలు, టాటాఏస్‌లో పరిమితికి మించి విద్యార్థు లను ఎక్కించినప్పుడు ప్రమాదం జరిగితే తల్లిదం డ్రులే బాధ్యత వహించాలి.
విద్యార్థులకు సూచనలు
* బస్సు ఎక్కేటప్పుడు, రోడ్డు దాటేటప్పుడు
క్యూ పద్ధతిని పాటించాలి.
* వాహనంలో ప్రయాణించేటప్పుడు చేతులు, తలను కిటికీలో నుంచి బయట పెట్టకూడదు.
* డ్రైవర్ సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే పాఠశాల యాజమాన్యాలతోపాటు తల్లిదండ్రులకు తెలుపాలి.
డ్రైవర్లు పాటించాల్సిన నియమాలు
* డ్యూటీలో కచ్చితంగా డ్రైవర్ యూనిఫాం ధరించాలి.
* పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించొద్దు.
* బస్సు కండీషన్‌లో ఉన్నది అని అనుకున్నప్పుడు మాత్రమే బయటికి తీయాలి.
* హెవీ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. హెవీ లైసెన్స్ వ్యాలిడిటీ, ఎక్స్‌ఫైర్ అయితే వెంటనే నిర్ధేశించిన సమ యంలో రెన్యువల్ చేయించు కోవాలి.
* నిర్ధేశించిన ప్రదేశాల్లోనే బస్సును ఆపాలి. బస్సు డోర్ మూసేంత వరకు బస్సును నడుపరాదు.
* వాహనాన్ని వెనుకకు తీసేటప్పుడు ఇతరుల సహాయాన్ని తీసుకోవాలి.
* పొగతాగడం, మద్యంసేవించడం లాంటి
దురలవాట్లు మానివేయాలి.
* ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి.
తక్కువ వేగంతో వాహనాన్ని నడుపాలి.
* ఏదైనా వస్తువు వాహనంలో మరిచిపోయి దాని కోసం వాహనం వద్దకు పరుగెత్తుకుని వచ్చే పిల్లల విషయంలో ఎటువంటి ప్రమాదం జరగకుండా అప్రమత్తంగా ఉండాలి.
పై నిబంధనలు పాటించినప్పుడే ప్రమాదాలు జరగవని రవాణాశాఖాధికారులు పేర్కొంటున్నారు.

స్కూల్ యాజమాన్యం
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
* పాఠశాల లేదా కళాశాల పేరు, టెలిఫోన్ నంబర్, మొబైల్ నంబర్‌తో సహా పూర్తి చిరునామా బస్సు ఎడమ వైపు, ముందు భాగంలో స్పష్టంగా కనిపించేలా రాయించాలి.
* ప్రైవేటు విద్యాసంస్థల బస్సులకు లేత పసుపురంగు వేయాలి.
* విద్యాసంస్థ బస్సు అని తెలియచేయడానికి వాహనం ముందు భాగంలో పైన సుమారు 400 ఎంఎంX400 ఎంఎం సైజులో బోర్డు సరిగ్గా అమర్చాలి. ఆ బోర్డు మీద 250 ఎంఎంకు తగ్గని ఎత్తులో ఇద్దరు పాఠశాల విద్యార్థులు (ఒక అమ్మాయి, అబ్బాయి) బొమ్మలు నల్లరంగులో చిత్రీకరించి ఉంచాలి.
* చిత్రం కింద స్కూల్ బస్సు లేదా కళాశాల బస్సు అని నల్లరంగులో కనీసం 100 ఎంఎం సైజు అక్షరాల్లో రాయించాలి.
* స్కూల్ బస్సులో ఒక్కరి కంటే ఎక్కువ మంది ఉపాధ్యాయులు ప్రయాణించేటట్లు చూడాలి. యాజమాన్యంతోపాటు పేరెంట్స్ కమిటీ సమన్వయంతో బస్సు బయలుదేరు ప్రాంతం నుంచి గమ్య స్థానం వరకు ప్రతి రోజు వంతులవారీగా ఒక టీచర్, ఒక పేరెంట్ బస్సులో ప్రయాణించేలా చూడాలి.
* బస్సులోంచి పిల్లలు తల బయటపెట్టకుండా విండోస్‌కు మూడు ఇనుప రాడ్లను బిగించాలి. బస్సుకు హ్యాండ్ బ్రేక్ ఉండాలి.
* పిల్లలను బస్సులోకి ఎక్కించడానికి, దించడానికి ప్రతి బస్సుకు డ్రైవర్‌తోపాటు ఒక సూపర్‌వైజర్‌ను నియమించుకోవాలి.
* డ్రైవర్లను నియమించుకునేటప్పుడు వారి గత చరిత్రను అధ్యయనం చేయాలి. సంపూర్ణ ఆరోగ్యంతోపాటు హెవీ లైసెన్స్ కలిగి 60 ఏళ్లు మించని అనుభవం ఉన్న డ్రైవర్‌ను నియమించుకోవాలి.
* డ్రైవర్ ఆరోగ్య పట్టికను నిర్వహించాలి. ప్రతి మూడు నెలలకు ఒకసారి యాజమాన్యం సొంత ఖర్చులతో డ్రైవర్‌కు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి.
* బస్సుకు సంబంధించిన రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్, పర్మిట్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, టాక్సీ రిసెట్స్ అన్నీ బస్సులోనే ఉండేలా చూసుకోవాలి. మార్గమధ్యలో బస్సు ఫెయిల్ అయితే యాజమాన్యం వెంటనే స్పందించి మరో బస్సును తక్షణమే పంపించాలి. అంత వరకు విద్యార్థులను ఒక చోటనే ఉండేటట్లు చూడాలి.
* బస్సుకు సంబంధించిన బాహ్య పరికరాలు, విండ్ స్క్రీన్, వైఫర్స్, లైటింగ్ తదితర మెకానికల్ కండిషన్, పనితీరును తెలుసుకునేందుకు నెలకు ఒకసారి ప్రిన్సిపాల్, పేరెంట్స్ కమిటీ బస్సును తనిఖీ చేయాలి. లభించిన సమాచారాన్ని బస్సులో ఉండే ప్రత్యేక రిజిస్ట్రర్‌లోనమోదు చేయాలి.
* స్కూల్ యాజమాన్యంతోపాటు తల్లిదండ్రులు ఒక కమిటీగా ఏర్పడి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి సమావేశాన్ని ఏర్పాటు చేసి లోటు పాట్లపై చర్చించి వాటి నివారణ చర్యలు చేపట్టాలి.
* ఒకే ప్రాంతంలో ఎక్కువ పాఠశాలలున్నప్పుడు అన్నిపాఠశాలలు ఒకేసారి పిల్లలను వదిలి పెట్టకుండా స్వల్ప తేడాతో వదిలిపెట్టాలి.
* ప్రతి వాహనంలో ఒక అత్యవసర ద్వారం కచ్చితంగా ఉంచాలి. దానిపై స్పష్టంగా కనిపించేలా అత్యవసర ద్వారం అని రాయించాలి.
* బస్సు ఇంజిన్ కంపార్టుమెంటులో ఒక అగ్నిమాపక యంత్రం(ఫైర్ ఎక్సిటింగ్విషర్) పొడి అందుబాటులో ఉంచాలి.

2224
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles