ఓ శాడిస్టు యువకుడి పైశాచికత్వం

Sun,March 10, 2019 07:13 AM

sadist young man arrested in girl kidnap case

హైదరాబాద్ : నగర నడిబొడ్డున ఓ బాలికను లైంగికంగా వేధించడమే కాకుండా వివస్త్రను చేసి ఆ దృశ్యాలను ఓ యువకుడు వీడియో తీశాడు. ఆ బాలిక వద్దని వేడుకున్నా వినకుండా తనలోని శాడిజాన్ని చూపించాడు. బాలికకు రక్తం వచ్చేలా కొట్టి చిత్రహింసలకు గురిచేశాడు. జుగుప్సారకమైన ఈ ఘటన హైదరాబాద్‌లోని గాంధీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. కొందరు మైనర్లు, యువకులు ట్యాంక్‌బండ్ కింద ఉన్న డీబీఆర్ మిల్స్‌లోని ఖాళీ ప్రదేశాన్ని అడ్డాగా చేసుకొని గంజాయి సేవిస్తూ, ఆ మత్తులో ఈ వికృత చేష్టలు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గంజాయి విక్రయదారులతో ఇక్కడుండే కొందరికి పరిచయాలు ఉండడంతో అవసరమైనప్పుడు గంజాయి దొరుకుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీసీపీ విశ్వప్రసాద్ కథనం ప్రకారం.. బషీర్‌బాగ్ చందానగర్‌కు చెందిన నాగరాజు దోమలగూడ మైసమ్మబండకు చెందిన ఓ బాలిక ప్రేమించుకుంటున్నారు.

ఈ క్రమంలో మార్చి 2వ తేదీన రాత్రి లోయర్ ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న డీబీఆర్ మిల్స్‌లోకి తీసుకెళ్లి బాలికపై లైంగిక దాడి చేశాడు. అయితే ఆ బాలిక ఇతరులతో మాట్లాడుతుందని, ఆమె సెల్‌ఫోన్‌లో కొత్తకొత్త వారి ఫోన్ నంబర్లు ఉండడంతో అతడు జీర్ణించుకోలేదు. వేరే వాళ్లతో ఎట్లా మాట్లాడుతావంటూ ఆ బాలికను కొట్టాడు. నీవు నాకే సొంతం.. ఇతరులతో మాట్లాడొద్దంటూ తన పైశాచికాన్ని ప్రదర్శించి బాలికపై దాడి చేశాడు. అప్పటికే ఆమె ముక్కులో నుంచి రక్తం రావడం, తలకు, చేతులకు గాయాలయ్యాయి. అంతటితో ఆగకుండా నీవు నాకే సొంతంగా ఉండాలంటే నీ వీడియోలను తీయాలంటూ, ఆమెను వివస్త్రను చేశాడు. ఆమె వద్దంటూ వారించినా... వేడుకుంటున్నా దృశ్యాలను రికార్డు చేశాడు. ఆ తరువాత రాత్రి ఎవరి ఇండ్లకు వారు వెళ్లిపోయారు.

శాడిస్ట్‌కు దేహశుద్ధి చేసిన యువకులు
నాలుగు రోజుల తరువాత నాగరాజు తిరిగి ఆ బాలికకు ఫోన్ చేశాడు. మరోసారి మనం కలుద్దామంటూ ఆమెకు సూచించాడు. అయితే 2వ తేదీన జరిగిన విషయాన్ని తనలోనే దాచుకొని కుమిలిపోతున్న ఆమెకు అతని నుంచి ఫోన్ రాగానే ఆందోళన చెందింది. మళ్లీ అక్కడకు వెళ్లిన తరువాత ఏమి జరుగుతుందోనని భయపడ్డ ఆమె వీడియోలు తీసిన విషయాన్ని మైసమ్మబండలోని యువకులకు చెప్పింది. దీంతో వాళ్లతో కలిసి ఆమె నాగరాజు రమ్మని చెప్పిన డీబీఆర్ మిల్స్‌కు వెళ్లారు. అక్కడకు వెళ్లిన తరువాత స్థానిక యువకులు నాగరాజుతోపాటు అతని స్నేహితులపై దాడి చేశారు. అతని సెల్‌ఫోన్‌లోని సదరు వీడియోలను తమ ఫోన్లకు బదిలీ చేసుకొని అతని ఫోన్లో నుంచి వాటిని డిలీట్ చేశారు. గొడవ పెద్దది కావడంతో ఆ వీడియోలు బయటకు రావడంతోపాటు బాలిక పరువు పోతుందని ఆమెతో చెప్పి పెండ్లి చేసుకుందామంటూ ఆమెను అక్కడి నుంచి తీసుకొని నాగరాజు పరారయ్యాడు. మరుసటి రోజు వరకు కూతురు ఇంటికి రాకపోవడంతో బాలిక తండ్రి నాగరాజుపై అనుమానం వ్యక్తం చేస్తూ గాంధీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు బాలిక కిడ్నాప్ అయినట్లుగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

వీడియోలు వైరల్.. యువకుడి అరెస్టు
శుక్రవారం ఉదయం నుంచే బాలిక కోసం పోలీసులు గాలింపు చేపట్టి, ఆమె ఎక్కడ ఉందనే విషయాన్ని గుర్తించారు. ఆమె తండ్రితో బాలికకు ఫోన్ చేయించి మాట్లాడించారు. ఆమె నెక్లెస్‌రోడ్డు పక్కనే ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ దవాఖానకు, ఆ తరువాత భరోసా కేంద్రానికి తీసుకెళ్లి కౌన్సెంగ్ నిర్వహించారు. శుక్రవారం బాలికను కుటుంబ సభ్యుల వద్దకు చేర్చిన అనంతరం రాత్రి 9 గంటల సమయంలో ఆ వీడియోలు బయటకు వచ్చి వైరలై సంచలనం సృష్టించాయి. బాలికతో మాట్లాడిన తరువాత కిడ్నాప్ కేసుతోపాటు అతనిపై 376, 354(డి), 366, 323 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, యువకుడైన నాగరాజును అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా, ఆ వీడియోలను లీక్ చేసిన యువకులపై 324, 67 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు డీసీపీ వివరాలను వెల్లడించారు.

2800
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles