ప్రభుత్వం ఉన్నంత కాలం రైతుబంధు : సీఎం కేసీఆర్

Sun,September 2, 2018 07:53 PM

హైదరాబాద్ : టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నంత కాలం రైతుబంధు పథకం కొనసాగుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రగతి నివేదన సభా వేదికపై సీఎం కేసీఆర్ మాట్లాడారు. రైతులు అప్పుల పాలు కావొద్దని రైతుబంధు ప్రవేశపెట్టాం. ఐదేళ్ల పాటు రైతులకు పెట్టుబడి సాయం చేస్తే ఏ రైతుకు అప్పు ఉండదన్నారు సీఎం. రెండు పంటలకు రూ. 8 వేలు పెట్టుబడి అందిస్తున్నామని సీఎం తెలిపారు. పంట సాయం చేయమని ఏ రైతు దరఖాస్తు పెట్టుకోలేదన్నారు. దురదృష్టవశాత్తు రైతు చనిపోతే అతని కుటుంబం రోడ్డున పడొద్దని రైతుబీమా పథకం అమలు చేశామని కేసీఆర్ తెలిపారు. ఇప్పటి వరకు 365 మంది రైతులు చనిపోతే వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున బీమా సొమ్ము అందించామని చెప్పారు.

3126
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles