రైతు సంక్షేమం కోసం రైతుబీమా పథకం: హరీశ్‌రావు

Fri,August 10, 2018 03:26 PM

Rythu bheema scheme for farmers welfare says minister harish rao

సిద్దిపేట: రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ రైతుబీమా పథకం ప్రవేశపెట్టినట్లు మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరులో మంత్రి హరీశ్‌రావు నేడు రైతు బీమా పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతు బీమాలో రూ. 270 కోట్లను రాష్ట్ర వాటా కింద ప్రభుత్వం చెల్లించిందన్నారు. రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ విశేషంగా కృషి చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ హయాంలో కరెంట్ కోసం పోరాటాలు చేసినం. తెలంగాణ వచ్చాక 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్నం. కాంగ్రెస్ హయాంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం పరామర్శించే నాథుడే లేడన్నారు. రైతుల సాగునీటి కష్టాలు శాశ్వతంగా తొలగించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతుల పొలాలకు సాగునీరు అందిస్తమని మంత్రి పేర్కొన్నారు.

1039
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles