రైతు బంధు నిరంతర ప్రక్రియ: మంత్రి పోచారం

Fri,August 10, 2018 12:23 PM

rythu bandhu scheme continuous process Minister Pocharam Srinivas reddy

జనగామ: జనగామ మండలం పెంబర్తి గ్రామంలో "రైతుబంధు జీవిత బీమా" దృవీకరణ పత్రాలను రైతులకు పంపిణీ కార్యక్రమం జరిగింది. సభలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కడియం శ్రీహరి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ పొచారం శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు. .

ఈ సందర్భంగా మంత్రి పోచారం మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి నాలుగు సంవత్సరాల నాలుగు నెలలు, అయినా ముఖ్యమంత్రి గారు లోతుగా ఆలోచన చేసి ప్రజలకు మేలు చెసే పథకాలను అమలు చేస్తున్నారు. అవకాశం ఉన్నా, హోదాలో ఉండి కూడా గతంలోని మంత్రి జనగామ వంటి వెనుకబడిన ప్రాంతానికి సాగునీరు, తాగునీరు అందించలేకపోయారు. కాని నేడు అందుతున్నాయి.గతంలో వానాకాలం వచ్చిందంటే విత్తనాలు, ఎరువుల పెట్టుబడికి వ్యాపారుల వద్ద అప్పు తెచ్చుకొనేవారు.

కాని నేడు మనసున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు రైతుబంధు పథకం ద్వారా ఎకరాకు రూ. 4000 చొప్పున ఇస్తున్నారు. ఈ ఏడాది వానాకాలంలో ఇప్పటి వరకు రూ. 5670 కోట్లు ఇచ్చాం. వచ్చే యాసంగి కోసం నవంబర్ 18 నుంచి చెక్కులను పంపిణీ చేస్తాం. దీనికోసం ప్రభుత్వం నిధుల విడుదలకు అనుమతించింది. రాష్ట్రంలో 91 శాతం మంది చిన్న, సన్నకారు రైతులే ఉన్నారు. మొత్తం 58 లక్షల మంది రైతులలో 51 లక్షల మంది చిన్న రైతులే ఉన్నారు.

18 నుండి 60 ఏళ్ళ లోపు ఉన్న రైతులు 31 లక్షల మంది ఉన్నారు. కుటుంబానికి ఆధారమైన రైతు దురదృష్టవశాత్తు మరణించినా ఆ కుటుంబం ఆర్ధికంగా ఇబ్బందుల పడకూడదనే మంచి ఉద్యేశంతో రాష్ట్రంలో రైతుబంధు జీవిత బీమా అమలు చేస్తున్నాం. ప్రతి రైతుకు ప్రీమియంగా రూ. 2,271 చొప్పున మొత్తం 636 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం LIC సంస్థకు చెల్లించడం జరిగింది. 18 నుండి 59 సంవత్సరాల వయస్సు కలిగిన రైతులు బీమా కు అర్హులు. అగస్టు 14 రాత్రి నుండి రైతుబంధు జీవితబీమా అమలులోకి వస్తుంది. వచ్చే ఏడాది అగస్టు 13 వరకు వర్తిస్తుంది.

కుటుంబానికి ఆదారమైన రైతు దురదృష్టవశాత్తు చనిపోతే, ఆ కుటుంబానికి ఆసరాగా రూ. 5 లక్షల బీమా అందుతుంది. రైతు చనిపోయిన పది రోజులలోనే నామినీకి రూ. 5 లక్షల చెక్కు అందుతుంది. ఈ రూ. 5 లక్షలను బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నా 8 శాతం వడ్డీ చొప్పున ఏడాదికి రూ. 40,000 లభిస్తుంది. కుటుంబాన్ని పోషించే రైతు దురదృష్టవశాత్తు మరణించినా ఆ కుటుంబం ఈ డబ్బులతో ఆర్ధిక ఇబ్బందులు లేకుండా బతుకుతుంది.

రైతుబంధు పథకం నిరంతరం కొనసాగుతుంది. అర్హులైన, కొత్తగా భూమి మార్పులు జరిగి పాస్ పుస్తకాలను పొందిన రైతులకు ఈ పథకం వర్తింపచేస్తాం. ఇప్పటికే వెరే రకాలైన బీమా ఉన్న రైతులు కూడా ఈ పథకానికి అర్హులు, అశ్రద్ద చేయకుండా రైతు బీమా పథకంలో పేర్లను నమోదు చేయించుకోవాలి. రైతులు ఆత్మగౌరవంతో బతకాలి, అప్పుల ఊభి నుండి బయటపడాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు.

752
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS