పొలంలోనే రైతుకు చెక్కు అందజేసిన ఎంపీ

Wed,May 16, 2018 11:45 AM

rythu bandhu scheme checks given to farmers in adilabad

ముఖ్ర కె: ఆదిలాబాద్‌లోని ముఖ్ర కే గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు బంధు పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యుడు ఎంపీ నగేశ్ పాల్గొని రైతులకు చెక్కులు పంపిణీ చేశారు. అంత‌కుముందు స్థానిక గ్రామ ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఓ రైతుకు చెందిన పొలం వద్దకు స్వయంగా వెళ్లిన ఎంపీ నగేశ్ పంట పొలంలోనే రైతుకు చెక్కు అందించారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి రైతులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీడీసీ ప్రెసిడెంట్ గాడ్గె సుభాష్, ఏంసీ ఛైర్మన్ ఆడె షెల్లా , జెడ్పీటీసీ కుమార్, ఎమ్మార్వో, వీర్వోలు తదితరులు పాల్గొన్నారు.

2666
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles