హ‌రిత‌హారం కోసం గ‌న్ పార్క్ నుంచి మంథ‌ని వ‌ర‌కు ప‌రుగు

Sat,July 29, 2017 08:43 AM

Run for Harithaharam campaign from Gun park to manthani

హైద‌రాబాద్: హ‌రిత‌హారం కార్య‌క్ర‌మంపై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు న‌గ‌రంలోని గ‌న్ పార్క్ నుంచి పెద్ద‌ప‌ల్లి జిల్లా మంథ‌ని వ‌ర‌కు తిరుప‌తి అనే యువ‌కుడు పరుగు ప్రారంభించాడు. ఇవాళ ఉద‌యం గ‌న్ పార్క్ వ‌ద్ద జెండా ఊపి ర‌న్ ను ప్రారంభించారు ప్ర‌భుత్వ స‌ల‌హాదారు వివేక్, మంథ‌ని ఎమ్మెల్యే పుట్ట మ‌ధు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన వివేక్.. హ‌రిత‌హారం కార్య‌క్ర‌మాన్ని దేశ వ్యాప్తంగా ప్ర‌ముఖులు అభినందిస్తున్నార‌ని .. హ‌రిత‌హారం కార్య‌క్ర‌మాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌న్నారు. హ‌రిత‌హారంపై ప్ర‌చారం క‌ల్పించేందుకు తిరుప‌తి ర‌న్ చేయ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు వివేక్.

తిరుప‌తి త‌ల‌పెట్టిన ర‌న్ చాలా ప్ర‌త్యేక‌మైన‌ద‌ని ఎమ్మెల్యే పుట్ట మధు కొనియాడారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేర‌కు మంథ‌నిలో హ‌రిత‌హారం జోరుగా సాగుతున్న‌ద‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రు హ‌రిత‌హారంలో భాగ‌స్వాములు కావాల‌న్ని ఆయ‌న కోరారు. మొక్క‌లు నాట‌డ‌మే కాదు.. వాటి సంర‌క్ష‌ణ కూడా విధిగా నిర్వ‌హించాల‌ని మ‌ధు స్ప‌ష్టం చేశారు. రెండు రోజుల్లో మంథ‌ని చేరుకుంటాన‌ని... రోజు కు 120 కిలోమీట‌ర్లు ప‌రిగెత్త‌డ‌మే త‌న ల‌క్ష్య‌మ‌ని ర‌న్న‌ర్ తిరుప‌తి వ్య‌క్తం చేశాడు.

963
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles