నెక్లెస్‌రోడ్డులో రన్ ఫర్ క్యాస్ట్ ఫ్రీ ఇండియా

Thu,April 14, 2016 11:26 AM

run for caste free india at necklace road

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈమేరకు ఇవాళ నెక్లెస్‌రోడ్డులో రన్ ఫర్ క్యాస్ట్ ఫ్రీ ఇండియా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి జగదీశ్‌రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం తదితరులు పాల్గొన్నారు. పలువురు నేతలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి రన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ... రాజ్యాంగం అమలులోకి వచ్చి 60 ఏళ్లు అవుతున్నా కుల వివక్ష ఉండటం దురదృష్టకరమన్నారు. ప్రతీ ఒక్కరూ కుల వివక్ష నిర్మూలనకు పాటుపడాలని కోరారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసమే రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని మంత్రి జగదీశ్‌రెడ్డి కోరారు.

1377
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles