రుద్రారం మర్డర్ కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్

Thu,June 13, 2019 11:27 AM

Rudrathram Murder case main accused arrested

సంగారెడ్డి: మే 31వ తేదీన జిల్లాలోని రుద్రారం గ్రామ సమీపంలో నేషనల్ హైవేపై హుస్సెన్ మహబూబ్ అనే వ్యక్తిని అందరూ చూస్తుండగా దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు మరో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. రూ.5 లక్షలు సుపారీ తీసుకుని హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. రేషన్ బియ్యం అక్రమ రవాణా ముఠాల మధ్య విభేదాలతో మృతుడు హుస్సెన్ గత ఏడాది నవంబర్‌లో లక్డారం గ్రామ సమీపంలో హర్షద్ అనే వ్యక్తిని హత్య చేశాడు. దీనికి ప్రతికారంగానే హుస్సెన్ మహబూబ్ హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు.

2759
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles