సీనియర్ సిటిజన్‌కు సీటు ఇవ్వనందుకు రూ.6వేలు జరిమానా

Thu,February 28, 2019 11:16 AM

RTC to pay senior citizen Rs 6000 for not providing bus seat

సంగారెడ్డి : ఆర్టీసీ బస్సులో సీనియర్ సిటిజన్‌కు సీటు ఇవ్వకపోవడంతో మెదక్ డిపో మేజేజర్‌కు రూ.6వేల పరిహారం చెల్లించాలని జిల్లా వినియోగదారుల ఫోరం ఆదేశాలు జారీ చేసింది. తాను ప్రయాణం చేస్తున్న బస్సులో సీనియర్ సిటిజన్‌కు కేటాయించబడిన సీటులో యువత కూర్చోవడం, ఆ వ్యక్తిని నుంచి సీటు ఇప్పించాలని బాధిత సీనియర్ సిటిజన్ సంబంధిత కండక్టర్‌ను కోరారు. సదరు కండక్టర్ కనీసం స్పందించకపోగా, సీనియర్ సిటిజన్‌తో నిర్లక్ష్యంగా ఉన్నందుకు బాధితుడు జిల్లా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాడు. దీంతో విచారణ చేపట్టిన ఫోరం బాధితుడికి రూ.5వేలు నష్టపరిహారం, అతడి ఖర్చుల కోసం రూ.1000, మొత్తం రూ.6వేలను చెల్లించాలని డిపో మేనేజర్‌కు ఆదేశాలు జారీ చేసింది.

బాధితుడు తెలిపిన పూర్తి వివరాలు ప్రకారం సంగారెడ్డిలోని శాంతినగర్‌కు చెందిన సీనియర్ సిటిజన్ అయిన న్యాయవాది సీహెచ్ నాగేందర్ 2017 జూన్ 18న ఉదయం 8.30 గంటలకు రామాయంపేట వెళ్లేందుకు మెదక్ బస్సు ఎక్కాడు. అయితే బస్సులో ఉన్న రద్దీ కారణంగా కూర్చునేందుకు సీనియర్ సిటిజన్లకు కేటాయించబడిన సీటు వద్దకు వెళ్లాడు. అప్పటికే ఆ సీటులో యువత కూర్చున్న విషయాన్ని గమనించి సదరు బస్సులో విధుల్లో ఉన్న బస్సు కండక్టర్ యాదయ్యను ఆశ్రయించాడు. అందుకు స్పందించని కండక్టర్ సీటు ఇప్పించకపోగా తనకు సంబంధం లేదని నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. దీంతో అదే నెల 22న డిపో మేనేజర్‌కు ఈ విషయమై బాధిత సీనియర్ సిటిజన్ నోటీసులు జారీ చేశారు. అందుకు మెదక్ డిపో మేనేజర్ స్పందించలేదు.

మేనేజర్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో స్థానిక జిల్లా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశాడు. దీంతో విచారణ చేపట్టిన ఫోరం సర్వీసు లోపం, కండక్టర్ నిర్లక్ష్యం ఉన్నదని గుర్తించారు. దీంతో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సదరు డిపో మేనేజర్ బాధితుడికి రూ.5 వేల పరిహారంతో పాటు ఖర్చుల నిమిత్తం రూ.వెయ్యి, మొత్తం రూ.6వేలు బాధితుడికి చెల్లించాలని ఫోరం అధ్యక్షురాలు పి. కస్తూరి, సభ్యులు మీనా రామనాథన్, జి శ్రీనివాస్ రావులు ఆదేశాలు జారీ చేశారు. బాధితుడికి వెంటనే పరిహారం చెల్లించాలని, విధుల్లో ఉన్న కండక్టర్లకు కచ్చితమైన సూచనలు జారీ చేయాలని ఉత్తర్వులో పేర్కొన్నారు.

2284
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles