చేప ప్రసాదం, ఇంటర్ పరీక్షలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

Fri,June 7, 2019 08:48 AM

RTC special buses for fish medicine distribution and inter-exams

హైదరాబాద్ : నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగే చేపమందు పంపిణీ కార్యక్రమానికి టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపి స్తున్నది. సుమారు 130 బస్సులను ఇందుకోసం ప్రత్యేకంగా ఆపరేట్ చేయ నుంది. నగరంలోని అన్ని ప్రాంతాలతోపాటు జేబీఎస్, సీబీఎస్, కాచిగూడ, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లతోపాటు శంషాబాద్ ఏయిర్‌పోర్టు నుంచి గ్రేటర్ ఆర్టీసీ బస్సులు నడిపించేందుకు ఏర్పాట్లు చేసింది. శుక్రవారం నుండి మొదలుకుని ఆదివారం వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు చేప ప్రసాదం కోసం వచ్చే వారి కోసం బస్సులు నడుపుతామని గ్రేటర్ హైదరాబాద్ ఈడీ వినోద్ కుమార్ తెలిపారు. అదేవిధంగా ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ కోసం కూడా ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం నుంచి జూన్ 14వ తేదీ వరకు ఉదయం,సాయంత్రం వేళల్లో బస్సులు నడిపిస్తామన్నారు.

1424
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles