ఆర్టీసీ జేఏసీ అత్యవసర సమావేశం

Wed,November 20, 2019 01:08 PM

హైదరాబాద్‌ : నగరంలోని మహాత్మాగాంధీ బస్టాండ్‌లో ఆర్టీసీ జేఏసీ నేతలు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. హైకోర్టు తీర్పు, భవిష్యత్‌ కార్యాచరణపై జేఏసీ నేతలు చర్చిస్తున్నారు. సమ్మెపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సాయంత్రం 4 గంటలకు జేఏసీ నేతలు మరోసారి సమావేశమై సమ్మెపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.


ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో సమ్మెను కొనసాగించడమా? విరమించడమా? అనే అంశంపై కార్మికసంఘాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. మంగళవారం ఎల్బీనగర్ చింతలకుంటలోని హిమగిరిగార్డెన్‌లో ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ కేంద్ర కమిటీ సమావేశమైంది. సమ్మె కొనసాగింపు అంశంపై వివిధ డిపోల కార్యదర్శుల అభిప్రాయాలను సేకరించారు. సమ్మెను కొనసాగించడం వల్ల ఎలాంటి లాభం లేదని, ఇప్పటికే కార్మికుల చేతిలో నుంచి సమ్మె అంశం చేజారిందని పలువురు డిపో కార్యదర్శులు నాయకత్వానికి నిర్మొహమాటంగా వెల్లడించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

2194
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles