బ్రేకులు ఫెయిలవడంతోనే కొండగట్టు ప్రమాదం!

Tue,September 11, 2018 01:38 PM

RTC Bus fell in George at Kondagattu ghat road after breaks fail

జగిత్యాల : కొండగట్టు ఘాట్ రోడ్డులో జగిత్యాల ఆర్డీసీ డిపోకు చెందిన బస్సు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఇవాళ ఉదయం కొండగట్టు నుంచి 60 మంది ప్రయాణికులతో ఆర్టీసీ బస్సు కిందకు వస్తుండగా.. మార్గమధ్యలో బ్రేకులు ఫెయిల్ అయినట్లు తెలుస్తోంది. ఇక 100 మీటర్లు అయితే ఘాట్ రోడ్డు నుంచి సాధారణ రోడ్డుకు బస్సు వస్తుందన్న సమయంలో రోడ్డు పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. అక్కడే పార్క్ చేసి ఉంచిన టాటా ఏస్‌ను బస్సు ఢీకొట్టింది. అయితే బస్సు డ్రైవర్ రెండు కాళ్లు విరిగిపోయాయి. తలకు తీవ్ర గాయమైంది. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో 45 మంది మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు.. వీరిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మృతులు, క్షతగాత్రులంతా కొడిమ్యాల మండలంలోని నాలుగు గ్రామాలకు చెందిన వారిగా తెలుస్తోంది.

8792
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles