ఆర్టీసీ బస్సు డ్రైవ‌ర్‌కు గుండెపోటు..

Wed,January 23, 2019 10:27 AM

RTC bus driver suffered with heart attack

పెద్దపల్లి: గోదావరిఖని నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ గుండెపోటుకు గురయ్యాడు. కాగా నొప్పిని భరిస్తూనే డ్రైవర్ మహేందర్ బస్సును రోడ్డు పక్కకు నిలిపివేశాడు. అదేబస్సులో సింగరేణిలో వైద్యుడిగా పనిచేస్తున్న చంద్రశేఖర్ ప్రయాణిస్తున్నారు. వెంటనే స్పందించి డ్రైవర్ అత్యవసర చికిత్స అందించాడు. చికిత్స అనంతరం బస్సు డ్రైవర్ పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రి తరలించారు. ప్రయాణికుడు తిరుపతి కమాన్ నుంచి పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రి వరకు బస్సును సురక్షితంగా నడిపాడు. బస్సులోని ప్రయాణికులందరూ కలిసి రూ. 2 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.

2204
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles