ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం

Wed,September 19, 2018 12:31 PM

rtc bus accelerator failed in Nagarkurnool

నాగర్‌ కర్నూల్: ఆమ్రాబాద్ మండలంలో ఆర్టీసీ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. శ్రీశైలం ఘాట్ రోడ్డులో వెళ్తుండగా బస్సు యాక్సిలేటర్ బోల్టు ఊడిపోయింది. యాక్సిలేటర్ బోల్టు ఊడిపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. డ్రైవర్ అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రయాణికులు తీవ్ర భాయభ్రాంతులకు గురయ్యారు. అచ్చంపేట డిపో బస్సు మల్లెలతీర్థం వెళ్తుండగా ఘాట్‌రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

2453
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles