టీఆర్‌ఎస్ ఆపన్నహస్తం..మృతుడి కుటుంబానికి రూ.2 లక్షలు

Sun,October 28, 2018 11:04 AM

సూర్యాపేట: యావత్ భారతదేశంలో పార్టీ సభ్యత్వానికి బీమా సౌకర్యం కల్పించి కార్యకర్తలకు ఆపన్నహస్తం అందించేది ఒక్క టీఆర్‌ఎస్ పార్టీనేనని మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 25వ వార్డుకు చెందిన టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్త శెట్టి అంజయ్య ఐదు నెలల కిత్రం రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. జరిగిన దుర్ఘటనపై మంత్రి విచారం వ్యక్తం చేశారు. మృతుడు అంజయ్య తాలూకు సభ్యత్వ వివరాలను సేకరించి బీమా ప్రాసెస్ నిమిత్తం పత్రాలను తెలంగాణ భవన్‌కు పంపాల్సిందిగా ఆదేశించారు. పత్రాల పరిశీలన అనంతరం బీమా కంపెనీ ఒప్పందం ప్రకారం అంజయ్య కుటుంబానికి రూ. 2 లక్షల రూపాయలను మంజూరు చేసింది. ఈ చెక్కును జగదీష్ రెడ్డి నేడు స్వయంగా మృతుడి ఇంటికి వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ కార్యకర్తల సంక్షేమం, ప్రజల సంక్షేమం గురించే ఉంటుందన్నారు.

2808
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles