ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రూ.2 కోట్ల వరకు వసూలు..

Fri,July 12, 2019 08:51 AM

Rs 2 crore fraud name of Corporate company jobs

హైదరాబాద్ : కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను మోసం చేస్తున్న ఇద్దరిని హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం... మల్లేపల్లి ప్రాంతానికి చెందిన రేష్మా బేగం అలియా స్ నేహ, కోదాడకు చెందిన షేక్ నహీమ్, మహారాష్ట్రకు చెందిన మహ్మద్ అలీ, చన్నైకు చెందిన మహ్మద్ జాఫర్‌లు ముఠాగా ఏర్పడ్డారు. తాత్కాలిక జాబ్ కన్సల్టెన్స్ కార్యాలయాలను తెరుస్తారు. విప్రో, అమెజాన్ కాగ్నిజెంట్ తదితర కార్పొరేట్ సంస్థల్లో బ్యాక్ డోర్‌లో ఉద్యోగాలు పెట్టిస్తామని నమ్మిస్తారు. దీని కోసం ఇతర జాబ్ కన్సల్టెన్సీలు, టెలికాలింగ్ ద్వారా జాబ్‌లు అందిస్తామని బురిడీ కొట్టిస్తారు. వీరి మాటలకు చిక్కిన వారి వద్ద నుంచి లక్ష నుంచి రెండు లక్షల వరకు వసూలు చేస్తారు. ఆ తర్వాత వారికి ఫేక్ కంపెనీ అపాయింట్‌మెంట్ పత్రాలు, మెయిల్ సమాచారం అందించి మాయ చేస్తారు. మరికొన్ని డబ్బులు కావాలని డిమాండ్ చేసి వసూలు చేస్తారు. ఈ విధంగా ఈ ముఠా దాదాపు 70 మంది నిరుద్యోగుల నుంచి రూ.2 కోట్ల వరకు వసూలు చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. వీరి మోసాలపై ఫిర్యాదులు రావడంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి రేష్మాబేగం, షేక్ నహీమ్‌లను అరెస్ట్ చేశారు. మహ్మద్ అలీ, మహ్మద్ జాఫర్‌లు పరారీలో ఉన్నారు.

785
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles