మల్లాపూర్‌లో వాహన తనిఖీలు.. రూ. 10 లక్షలు సీజ్

Tue,March 19, 2019 10:30 PM

RS. 10 lakh cash seized in vehicle check at mallapur

మేడ్చల్: జిల్లాలోని మల్లాపూర్‌లో ఎన్నికల అధికారులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేకుండా కారులో తరలిస్తున్న రూ. 10 లక్షలను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల వేళ ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా రూ. 2,46,15,300 నగదును స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా రూ. 2,37,70,300 విలువ చేసే మాదకద్రవ్యాలు, ఇతర వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రూ. 73,61,403 విలువ చేసే 54,163 లీటర్ల మద్యంను సీజ్ చేశారు. ఆదాయపన్నుశాఖ స్వాధీనం చేసుకున్న నగదు రూ. 1,60,53,400.

497
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles