రోడ్ల విస్తరణ పనులను త్వరగా పూర్తి చేయాలి: మంత్రి

Sun,August 25, 2019 02:24 PM

road works complete immediatly minister singireddy niranjan reddy

వనపర్తి: రోడ్ల విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. గోపాలపేట మండల కేంద్రం మీదుగా నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రానికి డబుల్‌ రోడ్లు వేయడానికి గానూ ప్రభుత్వం 49.14కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఈ పనులను మంత్రి శంకు స్థాపన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రోడ్లను నాణ్యతతో నిర్మించాలనీ, ఎక్కడా రాజీ పడకూడదని అన్నారు. నాణ్యత లేమితో రోడ్లను నిర్మిస్తే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అధికారులను హెచ్ఛరించారు. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలమూరు ఎత్తిపోతల పనులను పరిశీలిస్తారని మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

749
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles