ప్రాణం కంటే మించింది ఏదీ లేదు

Mon,February 4, 2019 01:31 PM

Road safety awareness programme at Saroor nagar Indore Stadium

హైదరాబాద్ : సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో 30వ రహదారి భద్రతా వారోత్సవాలు ఇవాళ జరిగాయి. రహదారి భద్రతా వారోత్సవాల్లో హోంమంత్రి మహముద్‌ అలీ, పోలీసు అధికారులు కృష్ణప్రసాద్‌, జితేందర్‌, మహేశ్‌ భగవత్‌, సినీనటుడు నందమూరి కళ్యాణ్‌రామ్‌ పాల్గొన్నారు. వారోత్సవాలకు వివిధ కళశాలల విద్యార్థులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా మహముద్‌ అలీ మాట్లాడుతూ.. దేశాభివృద్ధిలో యువత పాత్ర ఎంతో కీలకమన్నారు. ప్రమాదాల్లో 70 శాతం మంది యువతే ఉండటం బాధాకరమన్నారు. ట్రాఫిక్‌ నియమాలు పాటించడం ఎంతో ముఖ్యమని విద్యార్థులకు సూచించారు. పోలీసులు చేపడుతున్న చర్యల వల్ల ప్రమాదాలు కొంతమేర తగ్గాయన్నారు. పోలీసు శాఖకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. సౌకర్యాల కల్పన కోసం భారీగా నిధులు కేటాయిస్తున్నామని మహముద్‌ అలీ తెలిపారు.

నిర్లక్ష్యం వద్దు : కళ్యాణ్‌రామ్‌
భద్రతా నియమాలు తెలిసినా కొన్నిసార్లు నిర్లక్ష్యం చేస్తాం.. తెలిసి కూడా నిర్లక్ష్యం చేయడం మంచిది కాదని కళ్యాణ్‌రామ్‌ సూచించారు. చిన్నపాటి నిర్లక్ష్యమే ప్రాణాలు తీస్తోందన్నారు. 2014, 2018లో మా అన్నయ్య, నాన్నను కోల్పోయానని గుర్తు చేశారు. ప్రాణం కంటే మించింది ఏదీ లేదు. రహదారిపై వెళ్లేటప్పుడు ట్రాఫిక్‌ నియమాలు పాటించండి. సిగ్నల్స్‌ దగ్గర ఒక్క నిమిషం ఆగి వెళ్లడం వల్ల ఎలాంటి సమయం మించిపోదు. ప్రజల బాగోగుల కోసమే పోలీసులు ఉన్నారని కళ్యాణ్‌రామ్‌ తెలిపారు.

1654
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles